
Amala Paul: రెండో పెళ్లికి అమలా పాల్ రెడీ.. వరుడు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్.. తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకుంది.
నాగ చైతన్య నటించిన బెజవాడ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ మద్దుగుమ్మ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో కనిపించింది.
ఆ తర్వాత 2013లో రామ్ చరణ్‌తో నాయక్ సినిమా చేసింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు,మేము, ఆమె వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ఇవాళ అమలా పాల్ పుట్టిన రోజు సందర్భంగా ఓపబ్బులో సెలబ్రేట్ చేసిన జగత్ దేశాయ్, ఆమె పెళ్లి ప్రపోజల్ చేశాడు. దీనికి అమలా పాల్ సంతోషంగా ఓకే చెప్పింది.
Details
జగత్ దేశాయ్ తో అమలా పాల్ పెళ్లి!
ఆ వీడియోను జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో షేరే చేశారు. 'నా రాణి ఎస్ చెప్పిందంటూ జగత్ దేశాయ్ సంతోషాన్ని పంచుకున్నాడు.
ఇక జగత్ దేశాయ్ సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిగా కనిపించడం లేదు.
తొమ్మిది వారాల క్రితం అమలతో సన్నిహితంగా దిగిన ఫోటోను జగత్ దేశాయ్ షేర్ చేసి, లవ్ సింబల్ ఎమోజీ జోడించారు. అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితమే ప్రేమ పుట్టినట్లు అర్థమవుతోంది.
దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్‌కు 2014లో వివాహం జరిగింది. అయితే మూడేళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.