Page Loader
Pawan Kalyan: 'అద్భుత నటుడు, చిరంజీవి తమ్ముడు'.. KBCలో పవన్ కళ్యాణ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు వైరల్
'అద్భుత నటుడు, చిరంజీవి తమ్ముడు'.. KBCలో పవన్ కళ్యాణ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు వైరల్

Pawan Kalyan: 'అద్భుత నటుడు, చిరంజీవి తమ్ముడు'.. KBCలో పవన్ కళ్యాణ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్ అయ్యినా, ఆయనకు చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు ఉంటుంది. తాజాగా, ఈ విషయం బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా పరోక్షంగా ప్రస్తావించారు. అమితాబ్ హోస్ట్ చేస్తున్న ప్రసిద్ధ "కౌన్ బనేగా కరోడ్ పతి" షోలో, పవన్ కళ్యాణ్‌ గురించి ప్రశ్న ఒకటి అడిగారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవికి చేరుకున్న నటుడు ఎవరు? అని ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్నలో ఆప్షన్లుగా పవన్ కళ్యాణ్‌, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ పేర్లు ఉన్నాయి.

Details

వీడియోను షేర్ చేస్తున్న పవన్ అభిమానులు

కంటెస్టెంట్‌కి సమాధానం తెలియకపోవడంతో, ఆడియెన్స్‌ పోలింగ్‌కు వెళ్లారు. ఆడియెన్స్ మొత్తం పవన్ కళ్యాణ్‌నే సరిగ్గా గుర్తించారు. పవన్ కళ్యాణ్‌నే కరెక్ట్ సమాధానంగా సెలెక్ట్ చేయడంతో, కంటెస్టెంట్ రూ.1.6 లక్షలు గెల్చుకున్నారు. తర్వాత అమితాబ్, కంటెస్టెంట్‌కి పవన్ కళ్యాణ్‌ గురించి పరిచయం చేస్తూ, "అద్భుత నటుడు, చిరంజీవి చిన్న తమ్ముడు," అంటూ వివరించారు. పవన్ కళ్యాణ్‌ రాజకీయ రంగంలోకి వచ్చి జనసేన పార్టీ స్థాపించారని, ఈసారి ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారని చెప్పారు. అమితాబ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ అభిమానులు, జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు.