Amitabh Nagarjuna : ఊపిరి రీమేక్'లో అమితాబ్.. బాలీవుడ్'లోనూ తెరకెక్కనున్న సూపర్ హిట్ మూవీ
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఊపిరి రిమేక్ కానుంది. ఈ మేరకు బాలీవుడ్'లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. అయితే అక్కినేని నాగార్జున పాత్రలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ నటించనుండటం విశేషం. ఇదే సమయంలో అమితాబ్ సైతం ఈ పాత్రని మెచ్చి చాలా ఇష్టంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున, తమిళ స్టార్ హీరో కార్తిల క్రేజీ కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఊపిరి' తెరకెక్కింది. 25 మార్చి 2016న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్రెంచ్‌లో క్లాసిక్ అనిపించుకున్న 'ది ఇన్‌టచబుల్స్' సినిమాను టాలీవుడ్ ఆలోచనా విధానానికి, పరిస్థితులకు తగ్గట్లు, తెలుగు ప్రేక్షకుల నేపథ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. నాగార్జున కార్తీల జర్నీని సినిమా ఆసాంతం చూస్తూండిపోయేలా రూపొందించారు.
ఏమోషన్స్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఊపిరి
కార్తీ పాత్రలోని చలాకీతనం, అల్లరి, నాగార్జున పాత్రలోని స్వచ్ఛమైన నిండుతనం, రెండింటినీ ప్రతిబింబించేలా నవ్వించడం, ఏడిపించడం లాంటి అనుభూతులతో సాగిపోతున్నాయి. ప్రెంచ్ ఒరిజినల్ వెర్షన్ మినహాయించి తెలుగులోని సీన్స్, స్క్రీన్ ప్లేతో సినిమా చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున పాత్రలో అమితాబ్ బచ్చన్, కార్తీ క్యారెక్టర్ కోసం రాజ్ కుమార్ రావుని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించనున్నారు. మరోవైపు డైరెక్టర్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని,త్వరలోనే ఆ పని కూడా పూర్తి అవుతుందని సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. సంతోషం డబ్బులో లేదు,అయిన వాళ్ల మధ్యే అన్నీ ఉంటాయి అని తెలిసిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.