LOADING...
Allu Arjun - Atlee : అల్లు అర్జున్ - అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ హైప్! 
అల్లు అర్జున్ - అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ హైప్!

Allu Arjun - Atlee : అల్లు అర్జున్ - అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ హైప్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌ పై ఉన్న అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు, రూమర్స్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, ప్రతి కొత్త అప్‌డేట్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఆ షూట్‌ పూర్తయ్యాక జాన్వీ కపూర్‌ సెట్లో జాయిన్‌ కానుందని సమాచారం. అదనంగా పూజా హెగ్డే కోసం ప్రత్యేక సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నారని కూడా తెలిసింది.

Details

మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో కథ

ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌, అల్లు అర్జున్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని చెబుతున్నారు. బన్నీ కోసం అట్లీ ప్రత్యేకంగా ఒక పవర్‌ఫుల్‌ మాస్‌ రోల్‌ డిజైన్‌ చేశాడని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మొత్తం కథనం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒక డాన్‌ చుట్టూ తిరుగుతుందని సమాచారం అందుతోంది. ఈ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను సన్‌ పిక్చర్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రొడక్షన్‌ విలువలు, టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందిస్తున్నారు.

Details

ప్రముఖ స్టార్ లను అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం

మరో ఆసక్తికర విషయమేమిటంటే అట్లీ ఈ సినిమాలో కొన్ని గెస్ట్‌ రోల్స్‌ ప్లాన్‌ చేశాడట. ఆ రోల్స్‌ కోసం ఇప్పటికే ప్రముఖ స్టార్‌లను అప్రోచ్‌ అవుతున్నారని సమాచారం. మొత్తం మీద ఈ అల్లు అర్జున్‌ - అట్లీ కాంబో సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఒక భారీ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.