
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్
ఈ వార్తాకథనం ఏంటి
బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత వచ్చిన అమిగోస్ సినిమాతో సరైన హిట్ అందుకోలేకపోయాడు.
ప్రస్తుతం డెవిల్ సినిమాతో వస్తున్నాడు. ఇదివరకు డెవిల్ నుండి చిన్నపాటి గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమాలో బ్రిటీష్ రహస్య గూఢచారిగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. డెవిల్ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
ఈ మేరకు మేకర్స్ ఒకానొక ఫోటోను రిలీజ్ చేసారు. ఈ ఫోటోలో నిర్మాత అభిషేక్ నామా, డైరెక్టర్ నవీన్ మేడారం ఇంకా కొంతమంది కనిపిస్తున్నారు.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
The dubbing for #DevilBritishSecretAgent has officially kicked off, and we couldn't be more excited! @NANDAMURIKALYAN is all set to enthrall us as a British secret agent. Get ready for an edge-of-your-seat experience! 🕵️♂️🔥 #DubbingInProgress #Devil @iamsamyuktha_ @soundar16… pic.twitter.com/x5Il138OPj
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 6, 2023