Page Loader
కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య 
జులై 23న రిలీజ్ కానున్న కంగువ గ్లింప్స్

కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 22, 2023
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కంగువ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. జులై 23వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, గ్లింప్స్ వీడియోను ఏ సమయంలో రిలీజ్ చేస్తున్నారో అప్డేట్ ఇచ్చారు. జులై 23వ తేదీన అర్థరాత్రి 12:03 AM గంటలకు గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో సూర్య ముఖం కనిపించకుండా కత్తిని అడ్డంగా పెట్టి కేవలం కన్ను మాత్రమే కనిపించేలా చేసారు. దిశా పటాని హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్లింప్స్ విడుదల సమయంపై అప్డేట్