యాంకర్ అనసూయకు ఏమైంది.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు
ఎప్పుడు సోషల్ మీడియాలో సరదాగా ఉండే ఉంటే యాంకర్ అనసూయ కన్నిటీ పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానంటూ, ఏడస్తూ ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోన్టు చేసింది. దాదాపు ఐదు రోజుల క్రింత తాను ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలిపారు. ఈ ఏడుస్తున్న విజువల్స్ చూసి అంతా షాక్ అవుతారని, అందుకే ఈ పోస్టు చూసి గందరగోళానికి గురి అవ్వొద్దని ఆమె సూచించారు. సోషల్ మీడియాను ఒకప్పుడు సమాచారం, కమ్యూనికేషన్, నాలెడ్జ్ కోసం వాడామని, ప్రస్తుతం దాని కోసమే ఇప్పుడు వాడుతున్నామా అని ప్రశ్నించారు.
అందరి పట్ల దయతో ఉండాలన్న అనసూయ
తాను ఈ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో షూట్లు, నవ్విన నవ్వులు, వేసిన చిందులు, స్ట్రాంగ్ కౌంటర్లు ఇవన్నీ తన జీవితంలో ఒక భాగమని, ఓ పబ్లిక్ ఫిగర్‌గా తాను అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటానని అనసూయ పేర్కొంది. కొన్నిసార్లు తనమీద జరిగే ట్రోలింగ్స్ ను చూసి రెండు, మూడ్రోజులు చూసి బాధపడుతానని, తర్వాత మళ్లీ నవ్వుతూ బయటికొస్తానని, అయితే సమస్యల నుంచి పారిపోనని స్పష్టం చేసింది. అందరి పట్ల దయతో ఉండాలని ఆ వీడియోలో అనసూయ కోరారు. అయితే ఎందుకు ఏడ్చిందో అనసూయ వివరంగా చెప్పలేదు.