LOADING...
Mega 157: చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్‌ మెగా 157 టైటిలిదే..

Mega 157: చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్‌ మెగా 157 టైటిలిదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నోరోజులుగా అందరిలో ఆసక్తి కలిగించిన మెగా 157 (Mega 157) టైటిల్‌ను రివీల్‌ చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో,చిరంజీవి హీరోగా తెరకెక్కనున్నఈ చిత్రానికి 'మన శంకరవరప్రసాద్‌గారు' అనే సొగసైన టైటిల్‌ను అధికారికంగా నిర్ధారించారు. ఈ టైటిల్‌కు 'పండగకి వస్తున్నారు' అనే ఉపశీర్షికను కూడా జోడించారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలిసి,సినీ ప్రియులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయినుగా నటిస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనిల్‌-చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు 'మన శంకరవరప్రసాద్‌గారు' టైటిల్‌ ఖరారు