Page Loader
Mega 157: అనిల్ రావిపూడి భారీ ప్లాన్.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ ఎంట్రీ?
అనిల్ రావిపూడి భారీ ప్లాన్.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ ఎంట్రీ?

Mega 157: అనిల్ రావిపూడి భారీ ప్లాన్.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ ఎంట్రీ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగగా, స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్‌ను ఇటీవల ప్రత్యేక వీడియో ద్వారా పరిచయం చేశారు. అనిల్ రావిపూడి సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన కాన్సెప్ట్స్‌తో ప్లాన్ చేస్తారని తెలిసిందే.

Details

గెస్ట్ రోల్ లో వెంకీ

'మెగా157' కోసం కూడా ఆయన భారీ స్థాయిలో ఎట్రాక్షన్స్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవితో ఓ పాట పాడించనున్న అనిల్, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ ప్రత్యేక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. వెంకీ పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా ఓ ఫైట్ సీక్వెన్స్‌తో పాటు చిరు-వెంకీ కాంబోలో ఓ మాస్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.