LOADING...
 Anil Ravipudi: విజయ్ 'జన నాయగన్‌'పై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు 
విజయ్ 'జన నాయగన్‌'పై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు

 Anil Ravipudi: విజయ్ 'జన నాయగన్‌'పై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రం'జన నాయగన్'పై దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్‌గారు' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ సందర్భంగా విజయ్‌తో జరిగిన అనుభవాలను వెల్లడించారు. విజయ్ లాస్ట్ సినిమాకు తానే దర్శకుడిగా ఉండాలని కోరినట్టు అనిల్ రావిపూడి తెలిపారు. 'భగవంత్ కేసరి' సినిమాపై విజయ్‌కు గట్టి నమ్మకం ఉందని, అదే కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ప్రత్యేక ఆసక్తి చూపినట్టు చెప్పారు. ఈసందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. గతంలో 'భగవంత్ కేసరి' సినిమాను రిమేక్ చేయాలంటూ తనను సంప్రదించినప్పుడు, విజయ్‌తో స్ట్రైట్ సినిమా చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పానన్నారు.

Details

రికార్డులను బద్దలు కొడుతుంది

ఇది విజయ్ చివరి సినిమా కావడం, అందులోనూ రిమేక్ చేయడం పట్ల తనకు కొంత భయం ఉండటంతో ఆ బాధ్యతను తీసుకునే ధైర్యం చేయలేకపోయానని స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాపై విజయ్‌కు ఎంత నమ్మకం ఉందో ప్రత్యేకంగా ప్రస్తావించిన అనిల్ రావిపూడి.. తన సూచనలున్నప్పటికీ విజయ్ ఈ చిత్రాన్ని పట్టుబట్టి రిమేక్ చేయించారని చెప్పారు. సినిమా కంటెంట్ ఆయనకు ఎంతో నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. 'జన నాయగన్' చిత్రం ఎప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా చెప్పారు.

Advertisement