Anil Sunkara: అనీల్ కైవల్య దర్శకత్వంలో 'ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్' స్టార్ట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతగా గుర్తింపు పొందిన అనిల్ సుంకర మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతులైన కొత్త ముఖాలను సినిమా రంగానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుగా 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' అనే రియాలిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇప్పుడు అదే దిశలో మరింత ముందుకు సాగుతూ, తాజాగా ఒక వినూత్న ఫీచర్ చిత్రాన్ని ప్రకటించారు.
వివరాలు
'కొత్త సంవత్సరం… కొత్త ప్రారంభం… కొత్త కెప్టెన్'
ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్ కింద రూపొందనున్న ఈ చిత్రంలో పూర్తిగా కొత్త నటీనటులు, సాంకేతిక బృందం పనిచేయనున్నారు. ఈ సినిమాకు 'ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అనిల్ సుంకర.. అనీల్ కైవల్య అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. "కొత్త సంవత్సరం... కొత్త ప్రారంభం... కొత్త కెప్టెన్" అనే సందేశంతో ఈ సినిమాను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏటీవీ ఒరిజినల్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాణ సంస్థలు వెల్లడించాయి.