Page Loader
Pushpa 2: 'పుష్ప 2'లో 'యానిమల్‌' నటుడు.. నెట్టింట ఫొటో వైరల్
'పుష్ప 2'లో 'యానిమల్‌' నటుడు.. నెట్టింట ఫొటో వైరల్

Pushpa 2: 'పుష్ప 2'లో 'యానిమల్‌' నటుడు.. నెట్టింట ఫొటో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప 2'. తాజాగా, తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలిపిన నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో బ్రహ్మాజీ, సుకుమార్‌, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, 'యానిమల్‌' చిత్రంలోని సౌరభ్‌ సచ్‌దేవ కనిపించారు. బ్రహ్మాజీ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు, సినీ అభిమానులు 'సుకుమార్‌ భారీగా ప్లాన్‌ చేస్తున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'యానిమల్‌' చిత్రంలో బాబీ దేవోల్‌కు సోదరుడిగా నటించిన సౌరభ్‌ అందరికీ ఆకట్టుకున్నారు.

వివరాలు 

50 రోజుల్లో బాక్సాఫీసు ముందుకు.. 

డిసెంబరు 6న సినిమా విడుదల కానుందని గుర్తుచేస్తూ టీమ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ''పుష్ప: ది రూల్‌' ఫస్ట్‌ షో ఎక్కడ చూడబోతున్నారు?'' అని అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది. 'పుష్ప' పార్ట్‌ 1 మంచి విజయం సాధించడం, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్‌ 2 పై అంచనాలు తారస్థాయికి చేరాయి. అందువల్ల, 'పుష్ప 2' కథకు మరిన్ని హంగులు జోడించి సుకుమార్‌ తీర్చిదిద్దుతున్నారు.

వివరాలు 

దేవిశ్రీ ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మరోవైపు, తాను ఫస్టాఫ్‌ చూశానని, అదిరిపోయిందని, ప్రతి సన్నివేశం ఇంటర్వెల్‌లా ఉంటుందంటూ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌ ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా, శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన 'సూసేకి' 'పుష్ప పుష్పరాజ్‌' పాటలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి.