Animal Trailer : 'యానిమల్' ట్రైలర్ వచ్చేసింది.. ఊచకోత కోస్తున్న రణబీర్
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. (Animal) ఇందులో రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్ డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. డిసెంబర్ 1 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ యానిమల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చూస్తే.. తండ్రీ కొడుకుల చుట్టు తిరిగే కథ అని తెలుస్తోంది.
ఆకట్టుకుంటున్న 'యానిమల్' ట్రైలర్
ఈ సినిమాలో హీరో తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తుండగా, హీరో భార్య పాత్రలో రష్మిక నటిస్తోంది. బాబీ డియోల్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేశ్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. యానిమల్ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది.