LOADING...
VaaVaathiyaar : సంక్రాంతికి థియేటర్లలో 'అన్నగారు'.. జనవరి 14న గ్రాండ్ రిలీజ్!
సంక్రాంతికి థియేటర్లలో 'అన్నగారు'.. జనవరి 14న గ్రాండ్ రిలీజ్!

VaaVaathiyaar : సంక్రాంతికి థియేటర్లలో 'అన్నగారు'.. జనవరి 14న గ్రాండ్ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'వావాతియార్'. 'ఉప్పెన'తో గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. నిథిలిన్ కుమారస్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. మొదటగా ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. అనంతరం డిసెంబర్ 12న కొత్త విడుదల తేదీని ప్రకటించారు. దీనికి అనుగుణంగా హీరో కార్తీ తెలుగులో ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. కానీ విడుదలకు కొన్ని గంటల ముందే మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

Details

సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా

అనంతరం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పినా, ఆ తేదీ కూడా నిలవలేదు. దీంతో ఈ సినిమా విడుదలే కాదేమో అన్న ప్రచారం బలంగా వినిపించింది. అయితే తాజాగా విజయ్ నటించిన 'జననాయకన్' సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడటంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న మేకర్స్ హఠాత్తుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన 'అన్నగారు వస్తారు' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనేక ఆటంకాలు, వాయిదాల తర్వాత చివరకు సంక్రాంతి బరిలోకి దిగబోతుండటంతో, ఈ సినిమాపై మరోసారి ఆసక్తి నెలకొంది.

Advertisement