Page Loader
Biggest Multistarrer : టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్.. రజనీకాంత్‌తో రామ్ పోతినేని సినిమా!
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్.. రజనీకాంత్‌తో రామ్ పోతినేని సినిమా

Biggest Multistarrer : టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్.. రజనీకాంత్‌తో రామ్ పోతినేని సినిమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ముల్టీస్టారర్ ట్రెండ్ ప్రస్తుతం ఊపందుకుంది. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి" సినిమా ఒక పెద్ద మల్టీస్టారర్‌గా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ నటిస్తున్న "వీరమాస్" చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మరొక పెద్ద మల్టీస్టారర్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ పోతినేని హీరోగా మహేశ్ పి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ నటుడిని సంప్రదించినప్పటికీ, అతని తప్పుకోవడంతో, తమిళ స్టార్ రజనీకాంత్‌ను సంప్రదించి కథ వినిపించారు.

Details

  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్! 

రజనీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమా టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకోనున్నట్లుగా కనిపిస్తోంది. రజనీకాంత్ జైలర్ హిట్‌తో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాకి హీరోయిన్‌గా ఫేమ్ రుక్మిణి వసంత్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మహేశ్ పి, తన రెండో సినిమాగా రామ్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.