LOADING...
Ilaiyaraaja: భారతీయ సంగీతానికి చిరస్మరణీయ సేవలు.. ఇళయరాజాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
భారతీయ సంగీతానికి చిరస్మరణీయ సేవలు.. ఇళయరాజాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Ilaiyaraaja: భారతీయ సంగీతానికి చిరస్మరణీయ సేవలు.. ఇళయరాజాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. మహారాష్ట్రలో నిర్వహించనున్న అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (AIFF) నిర్వాహకులు, ఈ ఏడాది 'పద్మపాణి' పురస్కారాన్ని ఇళయరాజాకు ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాలుగా వేలాది అద్భుతమైన పాటలను అందిస్తూ, కోట్లాది మంది సంగీతాభిమానుల మనసులు గెలుచుకున్న ఇళయరాజా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నారు.

Details

జ్ఞాపిక, గౌరవ పత్రంతో పాటు రూ. 2 లక్షల నగదు బహుమతి

జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరగనున్న ఈ చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో ఇళయరాజా ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. ఈ గౌరవం ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. పద్మపాణి పురస్కారంలో భాగంగా ఇళయరాజాకు జ్ఞాపిక, గౌరవ పత్రంతో పాటు రూ. 2 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును జావేద్‌ అక్తర్‌, ఓం పురి, సాయి పరంజ్‌పే వంటి భారతీయ సినీ రంగ దిగ్గజులు అందుకున్నారు.

Details

ఇళయరాజాపై ప్రశంసలు

ఇప్పుడు ఆ జాబితాలో ఇళయరాజా పేరు చేరడం పట్ల ఆయన అభిమానులు, సంగీత కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాటలకే పరిమితం కాకుండా నేపథ్య సంగీతంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప సంగీత దర్శకుడికి ఈ పురస్కారం సముచితమని సినీ పరిశ్రమ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అజంతా ఎల్లోరా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement