Megastar Chiranjeevi: ఐఫా అవార్డ్స్‌లో చిరంజీవికి మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించి మంచి గుర్తింపును తెచ్చారు. ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి చిరంజీవి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. తాజాగా, చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) వేడుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ఘనంగా జరిగింది.
'ఔట్‌స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా' అవార్డు ప్రదానం
ఈ కార్యక్రమంలో ఆయనకు 'ఔట్‌స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ కూడా పాల్గొని చిరంజీవిని అభినందించారు. బాలకృష్ణ, చిరంజీవి ఒకరినొకరు కౌగిలించుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.