Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్యకు మరో అరుదైన గుర్తింపు.. ఫౌండింగ్ చైర్‌పర్సన్‌గా నియామకం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, వ్యాపారవేత్త అల్లు స్నేహారెడ్డికి కళా, సాంస్కృతిక రంగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన 'బౌలీ ఆర్ట్ సంఘం' కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి ఫౌండింగ్ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. భారతదేశంలోనే మొట్టమొదటి 'స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే'గా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమానికి ఆమె నాయకత్వం వహించనున్నారు.
వివరాలు
పురాతన మెట్ల బావుల వారసత్వాన్ని చాటిచెప్పే లక్ష్యం
దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పురాతన మెట్ల బావుల (బౌలీలు) చారిత్రక, పర్యావరణ ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం.
'ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్'కు చెందిన కల్పనా రమేశ్, 'ఏక్ చిత్ర'కు చెందిన అన్నపూర్ణ మాదిపాడిగ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
పురాతన బావులను కళా వేదికలుగా తీర్చిదిద్దడంతో పాటు, వాటి విశిష్టతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అల్లు స్నేహారెడ్డిని ఈ ప్రాజెక్ట్‌కు ముఖచిత్రంగా ఎంపిక చేశారు.
వివరాలు
40 రోజుల పాటు బౌలీ ఆర్ట్ ఫెస్టివల్
ఈ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి జనవరి 10 వరకు దాదాపు 40 రోజుల పాటు భారీ స్థాయిలో బౌలీ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
బన్సీలాల్‌పేట్, గోల్కొండ, రాష్ట్రపతి నిలయం, ఫలక్‌నుమా సహా 13కు పైగా చారిత్రక ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
200 మందికి పైగా కళాకారులతో వివిధ ప్రదర్శనలు, చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
కొత్త బాధ్యతపై స్నేహారెడ్డి స్పందన
బౌలీ ఆర్ట్ సంఘంలో కొత్త బాధ్యత చేపట్టడంపై అల్లు స్నేహారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "బౌలీ ఆర్ట్ సంఘంలో ఈ కొత్త బాధ్యత చేపట్టడం చాలా సంతోషంగా ఉంది.
మన నగరం యొక్క చరిత్ర, వారసత్వ సంపదపై ముఖ్యంగా యువతరంలో మరింత అవగాహన పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది.
భావితరాల కోసం మన సంస్కృతిని కాపాడే దిశగా ఇది ఒక అర్థవంతమైన అడుగు" అని పేర్కొన్నారు.