LOADING...
SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా?
మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా?

SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కాలేదు. అందువల్ల ప్రస్తుతంలో ఈ సినిమాను ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29గా పిలుస్తున్నారు. ఇప్పటివరకు పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ చిత్రం మరో స్టార్ హీరోని కూడా పరిచయం చేయనుంది. తమిళ్ పరిశ్రమలో స్టార్ నటుడిగా పేరు గడిచిన మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

త్వరలో అధికారికంగా ప్రకటన జరగనుంది. మాధవన్ త్వరలోనే షూటింగ్‌లో భాగమవుతారు. ఈ సినిమా కేవలం భారత్‌లో మాత్రమే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాలలో షూటింగ్ చేయనున్నట్టు ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని లొకేషన్లు ఫైనల్ అయ్యాయి. ఇది మొట్టమొదటి ఇండియన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. షూటింగ్ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్ నిర్ణయించే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీరవాణి సంగీతం అందిస్తున్నారు.