LOADING...
Anumpamkher: నా X ఖాతా ఎందుకు లాక్ అయ్యింది..?: ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించిన అనుపమ్‌ ఖేర్‌
నా X ఖాతా ఎందుకు లాక్ అయ్యింది..?: ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించిన అనుపమ్‌ ఖేర్‌

Anumpamkher: నా X ఖాతా ఎందుకు లాక్ అయ్యింది..?: ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించిన అనుపమ్‌ ఖేర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌(Anupam Kher)ఎక్స్‌ ఖాతా కొంతకాలం పాటు లాక్‌ అయింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన తాజాగా ఒక పోస్ట్‌ చేశారు.తన ఖాతా అనుకోకుండా లాక్‌ కావడానికి గల కారణాన్ని తెలియజేయాలని కోరుతూ ఎలాన్‌ మస్క్‌(Elon Musk)ను ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనుపమ్‌ ఖేర్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. కొంతసేపు తన ఖాతా లాక్‌ అయిన విషయాన్ని వెల్లడించారు.లాగిన్‌ కావడానికి ప్రయత్నించగా, వచ్చిన సందేశాన్ని స్క్రీన్‌షాట్‌ రూపంలో షేర్‌ చేశారు. ఆ సందేశంలో,"మీ ఖాతా లాక్‌ చేయబడింది.మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ చేసిన కంటెంట్‌ డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం ప్రకారం ఫిర్యాదుకు లోనైంది" అని అని అందులో రాసి ఉంది.

వివరాలు 

ఎక్స్‌ నిబంధనలపై కొంత అవగాహన ఉంది 

ఈ స్క్రీన్‌షాట్‌ను ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ షేర్‌ చేసిన అనుపమ్‌ ఖేర్‌ .. "డియర్‌ ఎక్స్‌, నా ఖాతా మళ్లీ యాక్టివ్‌ అయినప్పటికీ, అది ఎందుకు లాక్‌ అయ్యిందో నాకు అర్థం కావడం లేదు. 2007 సెప్టెంబర్ నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నాను. ఎక్స్‌ నిబంధనలపై కొంత అవగాహన కూడా ఉంది. అయినప్పటికీ, ఈ ఘటన నాకు అసౌకర్యాన్ని కలిగించింది. నేను ఎలాంటి నిబంధనను ఉల్లంఘించాను? దీని గురించి నాకు క్లారిటీ కావాలి" అని రాసుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనుపమ్ ఖేర్ చేసిన ట్వీట్