తదుపరి వార్తా కథనం

Anupama Parameswaran: ఆసక్తికరమైన టైటిల్ తో అనుపమ పరమేశ్వరన్ తెలుగు మూవీ!
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 13, 2024
12:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల దర్శకుడు మారి సెల్వరాజ్‌తో ఒక తమిళ చిత్రానికి సైన్ చేసింది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ధృవ్ విక్రమ్ హీరో.ఇదిలా ఉంటే ఆమె చేయబోయే తెలుగు ప్రాజెక్ట్ కూడా సంచలనం రేపుతోంది.
జూన్ 2023లో,అనుపమ,దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులతో ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసింది. ఇటీవలే,ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
ఈ చిత్రానికి 'పరదా' అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం.త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ నిర్మించిన చిత్రంతో,అనుపమతో కలిసి సంగీత,దర్శన రాజేంద్రన్,రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటించారు.
కాగా,అనుపమ చిత్రం టిల్లు స్క్వేర్ మార్చి 29, 2024న సినిమా థియేటర్ల్ లలో విడుదల కానుంది.