
Anushka: అనుష్క 'ఘాటీ' మూవీ న్యూ రిలీజ్ డేట్ లాక్..?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటీ' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఆమె చివరిసారిగా కనిపించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' తర్వాత ఇదే ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి వేదం వంటి విజయవంతమైన సినిమాను అందించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఘాటీ' గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
Details
రిలీజ్ డేట్ వాయిదా
ఇదిలా ఉంటే, ఈ సినిమాను మేకర్స్ మొదట ఏప్రిల్ 18న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే షూటింగ్‌లో డిలే కావడంతో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీనినిబట్టి రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 'సెప్టెంబర్ 5న' విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సీజీ వర్క్ ఆగస్టు నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో సెప్టెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అని టాక్.
Details
సెప్టెంబర్ లో రిలీజయ్యే అవకాశం?
ఇదే డేట్ ఫిక్స్ అయితే, సెప్టెంబర్‌లో యూవీ క్రియేషన్స్ నుండి రెండు సినిమాలు థియేటర్లకు రానున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ 'విశ్వంభర' కూడా అదే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఘాటీ కూడా అదే నెలకు మేకర్స్ ప్లాన్ చేస్తుండటంతో ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఘాటీ సినిమా విడుదలపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఇవ్వబోతున్నారా? సెప్టెంబర్ రిలీజ్ ఖరారు అవుతుందా? అన్నది సినీ ప్రేక్షకులలో ఉత్కంఠగా మారింది.