LOADING...
Ghaati release glimpse: ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుదలైన అనుష్క 'ఘాటి' గ్లింప్స్ 

Ghaati release glimpse: ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుదలైన అనుష్క 'ఘాటి' గ్లింప్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం "ఘాటి". ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదల నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ల ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందుగా శుక్రవారం రిలీజ్ కానున్న సందర్భంలో, చిత్ర బృందం గురువారం "ఘాటి రీలీజ్ గ్లింప్స్"ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ డార్లింగ్ ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌లైంది.

వివరాలు 

వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్‌

సినిమా తెలుగు మాత్రమే కాక, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించారు. వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుదలైన అనుష్క 'ఘాటి' గ్లింప్స్