Kathanar : 'కథనార్' ట్రైలర్ విడుదల.. అనుష్క ఫ్యాన్స్‌కు పండగ
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కథనార్' ట్రైలర్ విడుదలైంది. ఈ భారీ పీరియాడిక్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాల ఎంపికలో కాస్త విరామం తీసుకుంటూ, తక్కువ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన తెలుగు చిత్రం 'ఘాటీ' ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ 'కథనార్'లో నటిస్తోంది.
వివరాలు
ఆకట్టుకుంటున్న ట్రైలర్..
శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్కతో పాటు జయసూర్య, ప్రభుదేవా, సనూప్ సన్, వినీత్, శాండీ మాస్టర్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని యోచిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.