LOADING...
Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు భారత్‌లో గేట్‌వే ఏపీయే.. సీఎం చంద్రబాబు
సింగపూర్ పెట్టుబడులకు భారత్‌లో గేట్‌వే ఏపీయే.. సీఎం చంద్రబాబు

Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు భారత్‌లో గేట్‌వే ఏపీయే.. సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలో సింగపూర్‌తో భాగస్వామ్యం విషయంలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందిస్తూ అలా జరగకూడదు, కొన్ని రికార్డులు సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్తగా అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడుల అవకాశాలను సీఎం వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేశ్‌, పి. నారాయణ‌, టీజీ భరత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంపై చంద్రబాబు దృష్టిసారించారు.

Details

అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు

రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వివరించారు. అదేసమయంలో ఇండియా క్వాంటం మిషన్ కింద అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విశాఖపట్టణంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతోపాటు, రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణం ఉన్నట్లు సీఎంను తెలిపారు. సింగపూర్ పెట్టుబడులకు గేట్‌వే గా ఏపీ నిలుస్తుందని స్పష్టంచేశారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్‌ ఉందని హైకమిషనర్‌ అంబులే తెలియజేశారు.

Details

సమగ్రంగా వివరణ ఇచ్చిన మంత్రి

రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై మంత్రి నారాయణ సమగ్రంగా వివరణ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడంపై మంత్రి లోకేశ్ వివరించారు. ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలు ఏపీలో స్థాపించబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకమిషనర్‌ శిల్పక్ అంబులే మాట్లాడుతూ భారతదేశంతో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌కు గాఢమైన బంధం ఉందని, పెట్టుబడుల విషయంలో సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. అలాగే సింగపూర్ పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని వ్యాఖ్యానించారు.