Page Loader
Appudo Ippudo Eppudo: ఫార్మూల వ‌న్ రేస‌ర్‌గా నిఖిల్.. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ విడుదల 

Appudo Ippudo Eppudo: ఫార్మూల వ‌న్ రేస‌ర్‌గా నిఖిల్.. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo). 'సప్త సాగరాలు దాటి' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

వివరాలు 

ట్రైలర్ విశేషాలు 

ట్రైలర్ చూస్తుంటే నిఖిల్ ఫార్ములా వన్ రేసర్‌గా కనిపిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఒక బస్తీలో జీవిస్తున్న అతను, లండన్ వెళ్లి ఒక తెల్ల పిల్లను ప్రేమలో పడేసి, జీవితాన్ని సెటిల్ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగతాడు. లండన్ చేరుకున్న తర్వాత అతనికి ఎదురయ్యే సంఘటనలు, అతని ప్రేమ కథలో వచ్చే అనూహ్య మలుపులు ఈ కథలో ప్రధాన అంశాలు అని తెలుస్తుంది. ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో ప్రేమకథతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్