ఓజీ గ్లింప్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్: అభిమానులకు పూనకాలు రావాల్సిందే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. వరుస రీమేక్స్ తర్వాత వస్తున్న ఒరిజినల్ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓజీ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఓజీ నుండి అప్డేట్ వస్తుందని అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఓజీ గ్లింప్స్ విడుదలవుతుందని అంటున్నారు. ఈ గ్లింప్స్ వీడియోకు గంభీరమైన గొంతు కలిగిన అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఉండనుందని చెప్పుకుంటున్నారు.
కేజీఎఫ్ తరహా ఎలివేషన్ సీన్లతో ఓజీ గ్లింప్స్
72సెకన్ల గ్లింప్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్లు అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉండనున్నాయట. థమన్ మ్యూజిక్ తో ఎలివేషన్ సీన్ల రేంజ్ మారిపోతుందని వినిపిస్తుంది. కేజీఎఫ్ తరహా ఎలివేషన్ సీన్లు ఓజీ గ్లింప్స్ వీడియోలో కనిపించనున్నాయని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. గ్లింప్స్ వీడియో విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఓజీ గ్లింప్స్, అభిమానులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఓజీ సినిమాలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కించారు.