
Kaun Banega Crorepati: యూనిఫాంతో రియాలిటీ షోకు ఆర్మీ అధికారుల హాజరు.. ప్రోటోకాల్ వివాదం!
ఈ వార్తాకథనం ఏంటి
అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లో స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేక ఎపిసోడ్ రానుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ 'హనరింగ్ హీరోస్' పేరిట ప్రోమోతో ప్రచారం చేసింది. ఈ ఎపిసోడ్‌లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో కీలక పాత్ర పోషించిన సైనికులు హజరయ్యారు. వారిలో కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ పాల్గొన్నారు. ప్రోమోలో అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ప్రోమోలో అమితాబ్ బచ్చన్ ఆపరేషన్ సిందూర్ ఉద్దేశాన్ని అడిగినప్పుడు, కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ, "పాకిస్తాన్ తరచుగా ఉగ్రదాడులు చేస్తోంది. ప్రతి దానికి సముచిత స్పందన అవసరం. కాబట్టి ఆపరేషన్ సిందూర్ జరిగిందని అన్నారు.
Details
ఆర్మీ అధికారుల యూనిఫామ్‌లో షోలో పాల్గొనడంపై వివాదం
కానీ, ఈ కార్యక్రమంలో సైనికులు యూనిఫారంలో హాజరైన విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికారులను యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరమా? సైనిక ప్రోటోకాల్‌కు ఇది అనుమతించదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది విమర్శకులు కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్ని ఉపయోగిస్తున్నారన్న అభియోగాలు చేశారు. ఇతరులు భారత సాయుధ దళాల గౌరవం, హుందాతనం పరిరక్షించకపోవడం సిగ్గుచేటు అని ధ్యానించారు.
Details
ప్రోటోకాల్ ఏమి చెబుతుంది
సైనిక డ్రెస్ రెగ్యులేషన్స్ ప్రకారం: సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాల్లో, రెస్టారెంట్లు, వ్యక్తిగత ప్రయాణాల్లో కూడా వేసుకోకూడదు. ఒకవేళ కమాండింగ్ ఆఫీసర్ చేత రాతపూర్వక అనుమతి తీసుకుంటే, అనధికారిక కార్యక్రమాల కోసం యూనిఫామ్ ధరించవచ్చు. ఈ మేరకు, ఈ ముగ్గురు అధికారులు కూడా అనుమతి తీసుకుని KBC ప్రత్యేక ఎపిసోడ్‌కి హాజరైనట్లు భావించవచ్చు.