Page Loader
Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన
కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన

Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో భారతీయ సినీ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో అందర్ని ముగ్ధులను చేశారు. మే 21న జరిగిన ఈ ఈవెంట్‌లో ఆమె పాపిటలో సిందూరం ధరించి ట్రెండింగ్‌గా మారింది. సాంప్రదాయ భారతీయ నగలు, తెల్లటి చీరతో కూడిన ఆమె లుక్‌కు సిందూరం చివరి టచ్‌గా అద్భుతంగా కనిపించింది. ఈ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి.

వివరాలు 

సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన

ఐశ్వర్య రాయ్ సిందూరంతో కనిపించడంపై ప్రముఖ నటి సెలీనా జైట్లీ స్పందించారు. సిందూరం ధరించడం వెనుక ఉన్న లోతైన ప్రాధాన్యతను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. సిందూరం కేవలం సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాదు,ఇది ఉగ్రవాదం,అసహనం వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ఒక బలమైన సింబల్‌గా పనిచేస్తుందని సెలీనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సెలీనా, "ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో సిందూరం ట్రెండ్‌గా మారింది. ఇది కేవలం పెళ్లి బంధానికి గుర్తు మాత్రమే కాదు.ఇది భారతదేశం సామూహిక శక్తి,ప్రేమ,త్యాగం, ప్రతిఘటనకు ప్రతీక.ప్రపంచం ఇప్పుడు దీని సౌందర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, దాని నిజమైన అర్థాన్ని మర్చిపోకూడదు. ఇది పవిత్రమైనది,శక్తివంతమైనది,ఇప్పుడు ఇది ఒక స్టేట్‌మెంట్ కూడా"అని రాశారు.

వివరాలు 

కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ ట్రెండింగ్ లుక్ 

"సిందూరం ఒక వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు, ఇది ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడానికి, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడానికి,శాంతియుత జీవితం గడపడానికి మన హక్కును కాపాడుకోవడానికి ఒక పిలుపు. మన ప్రియమైనవారిని, కోల్పోయిన వారిని, వారిని తిరిగి పొందేందుకు పోరాడుతున్న వారిని సిందూరం ద్వారా గౌరవిస్తాము. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఇది మన నమ్మకాలు, పోరాటానికి ఒక ప్రతీక. దీన్ని గర్వంగా ధరించాలి" అని సెలీనా వివరించారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన మినరల్ వైట్ కలర్ సారీ, సాంప్రదాయ జ్వెలరీ, సిందూరంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక ఎపిక్ లుక్‌ను క్రియేట్ చేశారు. ఈ కాంబినేషన్ ఆమెకు గ్లోబల్ స్టేజ్‌లో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చింది.