
Atlee - Allu Arjun: ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అల్లు అర్జున్ మూవీపై అట్లీ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'AA 22' ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి అట్లీ స్వయంగా స్పందించారు. ఈ మూవీ చూస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగుళూరులో నిర్వహించిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు అట్లీ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో 'AA 22' గురించి మాట్లాడుతూ, "ప్రతి సారి ఒక ఆలోచనతోనే ప్రయాణం మొదలవుతుంది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు మేం కృషి చేస్తున్నామని చెప్పారు.
Details
రిస్క్‌గా భావించడం లేదు
ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా ఓ నూతన ప్రపంచాన్ని నిర్మించబోతున్నాం. మా ప్రయాణంలో ప్రతి అడుగులో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన దయతో మా ఆలోచించినట్లే అన్ని జరగాలని ఆశిస్తున్నాను. ఇంత భారీ చిత్రాన్ని చేయడం రిస్క్‌గా నేను భావించడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ను నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకో కొన్ని నెలల్లో మీరు కూడా దాన్ని స్వయంగా ఆస్వాదిస్తారని వివరించారు.
Details
కాంతార చాప్టర్ 1పై అట్లీ ప్రశంసలు
ఇక తాజాగా విడుదలైన 'కాంతార చాప్టర్ 1' సినిమాపై కూడా అట్లీ ప్రశంసలు కురిపించారు. "అది అసాధారణ చిత్రం. 'కాంతార 1' విడుదలైన తొలి రోజే నేను చూశాను. అప్పట్లో నేను విదేశాల్లో ఉన్నాను. సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లేందుకు దాదాపు రెండున్నర గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను. చూసిన వెంటనే రిషబ్ శెట్టి కి ఫోన్ చేసి అభినందించాను. నేను అత్యంత గౌరవించే వ్యక్తుల్లో రిషబ్ ఒకరు. ఆయన నాకు మంచి స్నేహితుడు కూడా. 'కాంతార చాప్టర్ 1'తో ఆయన మరో జాతీయ అవార్డును గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నానని అట్లీ పేర్కొన్నారు.