
Allu Arjun: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ సభ్యులు ఆందోళనకు దిగారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రేవతి కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా సాయం చేయాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలో జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వడం, పూల కుండీలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇంటిపైకి టమాటాలు విసిరినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జేఏసీ నేతలను అడ్డుకున్నారు.
Details
ఇంటి ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నాయకులు
పోలీసులు అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని కూడా అడ్డుకున్నారు.
ఈ సమయంలో, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు బయటకు రాలేదు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన ఘటనకు సంబంధించి, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో జేఏసీ ఈ ఆందోళన నిర్వహించింది.
రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో హైదరాబాద్‌లో పలు విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.