LOADING...
SS Rajamouli:డేవిడ్ వార్నర్‌కు బాహుబలి గిఫ్ట్.. SS రాజమౌళి తరఫున అరుదైన బహుమతి!
డేవిడ్ వార్నర్‌కు బాహుబలి గిఫ్ట్.. SS రాజమౌళి తరఫున అరుదైన బహుమతి!

SS Rajamouli:డేవిడ్ వార్నర్‌కు బాహుబలి గిఫ్ట్.. SS రాజమౌళి తరఫున అరుదైన బహుమతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్ అభిమానులే కాదు, సినీప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. గ్రౌండ్‌లో శతకాలతో రెచ్చిపోయే ఈ డాషింగ్ ఓపెనర్‌, సోషల్ మీడియాలో తెలుగుసినిమా పాటలకు డ్యాన్స్‌లు వేయడం, డబ్బింగ్ వీడియోలు చేయడం అంతా మనకెంతో పరిచయమే. ముఖ్యంగా ఆయన 'బాహుబలి' సినిమాపై చేసిన ఫన్నీ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు వార్నర్‌కు దర్శకధీరుడు రాజమౌళి నుంచి ప్రత్యేక గిఫ్ట్ రానుంది. ఇండియన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ బ్లాక్‌బస్టర్‌ను మళ్లీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అదే సందర్భంలో రాజమౌళి, డేవిడ్ వార్నర్‌కు 'బాహుబలి' కిరీటాన్ని పంపించబోతున్నట్టు వెల్లడించారు.

Details

ఫోటోను షేర్ చేసిన డేవిడ్ వార్నర్

తాజాగా వార్నర్ తన సోషల్ మీడియా పేజీలో గతంలో ధ‌రించిన బాహుబలి లుక్ ఫొటోలను షేర్ చేస్తూ, ' కిరీటంతో ఉన్న ఫొటో బాగుందా? లేకుండా ఉన్నది నచ్చిందా?' అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ, 'హాయ్ డేవిడ్.. మీరు మాహిష్మతి సామ్రాజ్యానికి అసలైన రాజుగా తయారవ్వండి. త్వరలోనే నేను మీకు ఆ కిరీటాన్ని పంపిస్తున్నానంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌కు వార్నర్ స్పందిస్తూ, 'ఎదురుచూస్తున్నానని రిప్లై ఇచ్చారు. ఇక బాహుబలి రెండు భాగాలను ఇప్పుడు ఒకే ఫార్మాట్‌లో 'బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic)' పేరుతో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ ఎడిషన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.