LOADING...
Anand Devarakonda : మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ జోడి ..'బేబి' కాంబోలో మరో సినిమా
మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ జోడి ..'బేబి' కాంబోలో మరో సినిమా

Anand Devarakonda : మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ జోడి ..'బేబి' కాంబోలో మరో సినిమా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాల్లో 'బేబీ' ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, మౌత్ టాక్ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటనకు విశేష ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందాయి.

వివరాలు 

 'ఓ రెండు మేఘాలిలా' టైటిల్‌

ఇప్పుడు,ఈ సూపర్ హిట్ జోడీ మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఆనంద్ దేవరకొండ,వైష్ణవి జంటగా మరో సినిమా త్వరలో ప్రారంభంకానుంది. ఈటీవీ విన్‌లో విడుదలై సెన్సేషన్ హిట్‌గా నిలిచిన #90 వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్,ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఈ సినిమాకు 'ఓ రెండు మేఘాలిలా' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వెబ్ సిరీస్ ద్వారా అందర్నీ ఆకట్టుకున్న ఆదిత్య హాసన్, మొదటిసారి సినిమా డైరెక్ట్ చేస్తుండటంతో, బేబీ వంటి సూపర్ హిట్ కాంబోతో ఆయన ఎంతటి విజయాన్ని సాధిస్తాడో చూడాల్సి ఉంది.