బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి
చిన్న సినిమాగా విడుదలైన బేబి ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా, ఇప్పటివరకు 71కోట్ల వసూళ్ళను సాధించింది. విడుదలై 12రోజులు అవుతున్నా కలెక్షన్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో పాటను యాడ్ చేయబోతున్నట్లు దర్శకుడు సాయి రాజేష్ తెలియజేసారు. చందమామ అంటూ సాగే ఈ పాటను దీపు పాడినట్లు సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. ఏడవ పాటగా యాడ్ కాబోతున్న ఈ పాట, ఎప్పటి నుండి యాడ్ అవుతుందనేది వెల్లడి చేయలేదు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందిన బేబి సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.