Page Loader
మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్
బేబీ షవర్ పంక్షన్ లో ఉపాసన

మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడులో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన జోడి ఒకటి. పెళ్లైన సూమారు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ను పొందిన విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని నెలలుగా కొణిదెల-కామినేని కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కొణిదెల ఉపాసన బేబీ షవర్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ లో చిరంజీవి నివాసంలో బుధవారం రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫంక్షన్ ని అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. ఇందులో సినీ సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేశాడు.

details

బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్న ఉపాసన

ఇదిలా ఉంటే బిడ్డ కోసం ఉపాసన చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉపాసన డెలవరీ కోసం విదేశాల నుంచి డాక్టర్లు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఉపాసనకు ఆమె సోదరీమణులు అనుష్పాల, సింధూరి దూబాయ్ లో సీమంతాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. వైద్యులు తనకు జూలైలో డేట్ ఇచ్చారని, ప్రతి క్షణం తనకెంతో చరణ్ సపోర్టు చేస్తున్నాడని, పుట్టిన బిడ్డను చూసుకుంటూనే తన కెరీర్ పై దృష్టి పెడతానని ఉపాసన ఇటీవల ఇంటర్వ్వూలో వెల్లడించిన విషయం తెలిసిందే.