చిరంజీవి 'మెగా 156'లో రానా దగ్గుబాటి.. మెగాస్టార్ ను ఢీకొట్టనున్న బాహుబలి విలన్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో చిరంజీవి మెగా 156కి సంబంధించి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు సినిమాలో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం సైతం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వీడియోని కూడా విడుదల చేశారు.
వసిష్ఠ దర్శకత్వంలో రాబోతున్నా ఈ సినిమా, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కబోతుంది.
ఇదే సమయంలో సినిమాకు సంబంధించి సంగీతం పనులు సైతం మొదలయ్యాయి. దీంతో వసిష్ఠ - చిరంజీవి మెగా 156 మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.
details
చిరంజీవితో రానా ఢీ అంటే ఢీ
మరోవైపు ఈ సినిమా తారాగణం గురించి ఇంకా పూర్తి సమాచారం వెలువడలేదు. కానీ ఈ మూవీకి సంబంధించి ఓ ఫేమస్ నటుడు విలన్ పాత్రలో నటించనున్నారు.
మెగా 156 సినిమాలో చిరంజీవి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రానా దబ్బుబాటి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నారు.
బాహుబలి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రభాస్ తో ఢీ అంటే ఢీ అన్నారు.
ఈసారి ఏకంగా చిరు సినిమాలోనూ విలన్ గా నటించనున్నారనే వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో మెగా 156పై అంచనాలు భారీగా పెరగడం గమనార్హం.