
బలగం సినిమాకు అవార్డుల జాతర: ఈసారి ఏకంగా 9అవార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలు సాధించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఎంత బాగున్నా ఒక్కోసారి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోలేవు. దానికి ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఈ మధ్య కాలంలో ఈ అదృష్టం బలగం సినిమాకు దక్కింది.
జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకులకు కమెడియన్ గా పరిచయమైన వేణు, బలగం సినిమాను తెరకెక్కించాడు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
మానవ సంబంధాలు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు, పల్లెటూరి సంస్కృతిని, ఆచారాలను, వ్యవహారాలను బలగం సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.
ప్రేక్షకుల హృదయాలను గెలిచిన బలగం సినిమా, అవార్డుల్లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా 9అవార్డులు దక్కించుకుంది.
Details
బలగం చిత్రానికి 9అవార్డులు
ఇండో ఫ్రెంఛ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో 9విభాగాల్లో అవార్డులు అందుకుంది బలగం సినిమా.
ఉత్తమ భారతీయ చిత్రం - బలగం
ఉత్తమ నిర్మాత- హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
ఉత్తమ తొలి సినిమా దర్శకుడు (విమర్శకుల ఛాయిస్) - వేణు యెల్దండి
ఉత్తమ నటుడు- ప్రియదర్శి పులికొండ
ఉత్తమ నటి - కావ్యా కళ్యాణ్ రామ్
ఉత్తమ సహాయ నటి - రూపాలక్ష్మి
ఉత్తమ సంగీతం- భీమ్స్ సిసిరోలియో
ఉత్తమ ఎడిటర్ - చింతల మధు
ఉత్తమ ఛాయాగ్రహణం - ఆచార్య వేణు
ఇవే కాదు ఇదివరకు లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్, ఉక్రెయిన్ కు చెందిన ఒనికో అవార్డ్స్, వాషింగ్టన్ డీసీ సినిమా ఫెస్టివల్స్ అవార్డులు దక్కించుకుంది బలగం సినిమా.