Yellamma Movie: 'ఎల్లమ్మ' సినిమాకి ముహూర్తం ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
బలగం సినిమా తర్వాత అందరి దృష్టి టాలీవుడ్ దర్శకుడు వేణుపై పడింది.
తెలంగాణ నేపథ్యంతో వచ్చిన బలగం సినిమాకు మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి.
ఈ ప్రాజెక్ట్ అనంతరం, వేణు కొత్తగా "ఎల్లమ్మ" అనే సినిమాను చేయబోతున్నాడని ప్రకటించాడు.
అయితే, "ఎల్లమ్మ" ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు.
వివరాలు
ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్
ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ అందలేదు.
అయితే, చాలా రోజుల తర్వాత, ఈ ప్రాజెక్ట్ గురించి ఒక అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు వేణు.
"ఎల్లమ్మ" సినిమా కోసం మేము సిద్ధమవుతున్నాము, త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వడం జరుగుతుంది" అని పేర్కొన్నాడు.
దీనితో, ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాను నిర్మించబోతున్న దిల్ రాజు కూడా ఫిబ్రవరిలో ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వబోతుందని ప్రకటించారు.
తాజాగా, వేణు ఈ సినిమాకు సంబంధించి స్పందించడంతో, త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి రాబోతున్నాయి.