Page Loader
Daaku Maharaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ
బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ

Daaku Maharaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'డాకు మహారాజ్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. బాలయ్య తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాను చూసిన నెటిజన్లు ఫస్ట్ హాఫ్‌ను అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు సినిమా అదిరిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్‌లలో కొంత ల్యాగ్ ఉందని వారు తెలిపారు. తమన్ సంగీతం కూడా ఈ సినిమాకు బాగుందని, బీజీఎం అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు.

Details

మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకొనేలా మూవీ

టెక్నికల్‌గా సినిమాను "బ్రిల్లియంట్" గా తీశారని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. కొంతమంది బాలయ్యను స్టైలిష్‌గా, సటిల్డ్‌గా చూపించడంలో దర్శకుడు బాబీ విజయవంతమైనట్లు పేర్కొన్నారు. మాస్ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్ చేసేలా సీన్లు డిజైన్ చేశాడని తెలిపారు. అయితే కథలో సస్పెన్స్ లేని నేపథ్యంలో, నెక్ట్స్ ఏమైపోతుందో ఆడియెన్స్‌కు ముందే అర్థం అవుతుందని కొంత మంది వ్యాఖ్యానించారు. అయినా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, బాబీ డైరెక్షన్, ఎలివేషన్, తమన్ బీజీఎం వల్ల ఈ సినిమా స్క్రీన్ మీద అద్భుత విజువల్స్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.