
HHVM: హరిహర వీరమల్లులో బాలయ్య సర్ప్రైజ్ ఎంట్రీ..? ఊహించని ట్విస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం దయాకర్ రావు నిర్మించగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో రూపొందింది. దయాకర్ రావు నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ కలిసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా టెక్నికల్ విభాగాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి.
Details
సినిమా ప్రమోషన్లలో బిజీగా పవన్ కళ్యాణ్
ఇక సినిమాకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియా ఇంటరాక్షన్ల ద్వారా సినిమాపై హైప్ మరింత పెంచుతున్నారు. ఇక తాజా ఇంటరెస్టింగ్ అప్‌డేట్ కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Details
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అన్వేష్
ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ తాజాగా ఓ వీడియో ద్వారా హరిహర వీరమల్లు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న అన్వేష్, అక్కడి నుంచే మొదటి సినిమా రివ్యూ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. సినిమా చూడగానే థియేటర్లో గూస్‌బంప్స్ వచ్చాయని, బాలకృష్ణ సినిమాలో స్పెషల్ రోల్ లో ఎంట్రీ ఇస్తారని పేర్కొన్నాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరిచింది.