CM Revanthreddy: బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై నిషేధం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన పాలనలో ప్రత్యేక రాయితీలు ఇవ్వమని స్పష్టంగా తెలిపారు. ముఖ్యంగా కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచేందుకు తమ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఉండదని పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక భారం పెంచే నిర్ణయాలకు తాను అనుమతి ఇవ్వనని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమతో సహా ఏ రంగానికైనా ప్రత్యేక రాయితీలు ఉండవని, తెలంగాణ ప్రజలందరికీ సమాన న్యాయం చేయడం తన ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ వివరించారు. ఈ నిర్ణయం తెలంగాణ సినీ పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
సామాన్య ప్రజలపై భారం పడకూడదు
సినిమా టికెట్ రేట్లు పెరిగితే సామాన్య ప్రజలకు భారం అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టంచేశారు. ప్రజల ప్రయోజనాలు రక్షించడం తన బాధ్యత అని, ప్రత్యేక రాయితీలు ఇచ్చే రోజులు ఇక లేరని ఆయన అన్నారు. సీఎం ప్రకటనపై సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.