Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట పెళ్లి హంగామా.. కూతురి ఎంగేజ్‌మెంట్‌లో భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన బండ్లన్న
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలో జరగనుండగా, సూర్య తేజ అనే యువకుడితో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు కూడా హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వివరాలు
ప్రతి అతిథికి దాదాపు రూ. 5 వేల విలువైన గిఫ్ట్..
ఈ వేడుకకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన కూతురు నిశ్చితార్థానికి వచ్చిన అతిథులందరికీ బండ్ల గణేష్ విలువైన రిటర్న్ గిఫ్ట్స్ అందించినట్లు సమాచారం. బండ్ల గణేష్ తన కుమార్తె జనని నిశ్చితార్థానికి వచ్చిన అతిథులకు "బర్గనర్" అనే ఆస్ట్రియన్ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేక బిర్యానీ హండీలను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. గిఫ్ట్ బాక్స్‌లో ఒక స్వీట్ బాక్స్, ఒక బ్లౌజ్ పీస్, అలాగే సుమారు 5 కిలోల బిర్యానీ హండి ఉన్నట్లు సమాచారం. మొత్తం కిచెన్ వేర్ సెట్ విలువ దాదాపు రూ. 5,000 వరకు ఉంటుందని చెబుతున్నారు.
వివరాలు
నెటిజన్ల కామెంట్స్ వైరల్..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఎంగేజ్‌మెంట్‌కే ఈ రేంజ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే పెళ్లికి ఇంకెంత ఘనంగా చేస్తారు?" అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "పెళ్లి వేడుక ఎలా ఉండబోతోంది?" అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బండ్ల గణేష్ కుటుంబానికి చెందిన వియ్యంకుల వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆయన కాబోయే అల్లుడు చిలుకూరి సూర్య తేజకు కూడా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే సూర్య తేజ వ్యక్తిగత వృత్తి వివరాలు..అతను ఉద్యోగం చేస్తున్నారా, రియల్ ఎస్టేట్‌లో ఉన్నారా లేదా ఇతర వ్యాపారాల్లో ఉన్నారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.