
బెదురులంక 2012 టీజర్: గ్రామంలో యుగాంతం వింతలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ ఎక్స్ 100 తర్వాత హీరో కార్తికేయకు సరైన హిట్ పడలేదు. విలన్ వేషాలు వేసినా కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే తాజాగా బెదురులంక 2012 సినిమాతో హీరోగా వస్తున్నాడు.
డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ విడుదలైంది. హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరిగింది.
2012లో యుగం అంతం ఐపోతుందని అనేక వార్తలు వినిపించాయి. దానిమీద 2012 అనే హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది. అవన్నీ గాలివార్తలే అని ఆ తర్వాత ప్రూవ్ అయ్యింది.
2012 యుగాంతం కాన్సెప్ట్ తోనే బెదురులంక 2012 మూవీ తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్ టాక్
హ్యాండ్సమ్ గా ఉన్న కార్తికేయ, ఆకర్షించేలా నేహాశెట్తి
ఈ టీజర్ లో కార్తికేయ చాలా కొత్తగా కనిపించాడు. అంతకుముందు సినిమాలతో పోల్చితే ఇంకా యంగ్ గా కనిపించాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది.
హీరోహీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ ఉందని టీజర్ లో చూపించారు. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.
విలన్ గా అజయ్ ఘోష్ ఉన్నాడని తెలుస్తోంది. ఇంకా ప్రధాన పాత్రల్లో కమెడియన్ సత్య, జబర్దస్త్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఉన్నారు.
లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాను క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, సాయి ప్రసాద్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి చేయగా ఎడిటింగ్ బాధ్యతలు విప్లవ్ నైషదమ్ తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెదురులంక 2012 టీజర్ విడుదల
Elated to launch the super fun #Bedurulanka2012Teaser ❤️https://t.co/gNb3cwfmnE
— Vijay Deverakonda (@TheDeverakonda) February 10, 2023
Best wishes to my hardworking brother @ActorKartikeya, @iamnehashetty the entire team of #Bedurulanka2012 🤘🤗#Clax @Benny_Muppaneni #ManiSharma @Loukyaoffl pic.twitter.com/J3LQCNaHcI