Page Loader
Puri-Sethupathi :క్రిస్మస్ బరిలో బెగ్గర్.. ఆ మూవీలతో పోటికి నిలబడుతుందా?
క్రిస్మస్ బరిలో బెగ్గర్.. ఆ మూవీలతో పోటికి నిలబడుతుందా?

Puri-Sethupathi :క్రిస్మస్ బరిలో బెగ్గర్.. ఆ మూవీలతో పోటికి నిలబడుతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ మల్టీలాంగ్వేజ్ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి - సేతుపతి కలిసి పనిచేయడం ఇదే తొలిసారి కావడంతో, ఈ క్రేజీ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక నటన పరంగా తనదైన ప్రత్యేకతను చూపే విజయ్ సేతుపతిని పూరి ఎలా మాస్ అవతారంలో చూపించనున్నాడోనన్నదే ఇప్పుడు చర్చాంశమైంది. ఈచిత్రంలో టబూ, దునియా విజయ్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా టైటిల్ విషయంలో 'బెగ్గర్'తో పాటు 'భవతి బిక్షాం దేహి' అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Details

షూటింగ్ వేగంగా పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్

పూరి జగన్నాథ్‌కు ఉన్న వేగానికి ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఒకవారంలో స్క్రిప్ట్ సిద్ధం చేసి, రెండు మూడు నెలల్లో పూర్తి సినిమా తీయగలిగే డైరెక్టర్ పూరి.. ఈసినిమాను కూడా అదే తక్కువ వ్యవధిలో పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై ఓవైపు ఆశ, మరోవైపు రిస్క్ కనిపిస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 5న రాజాసాబ్ సినిమా విడుదలవుతోంది.డిసెంబర్ 19న పాన్ వరల్డ్ లెవెల్ హాలీవుడ్ చిత్రం అవతార్ 3రిలీజ్ కానుంది. ఇదే సమయంలో బాలకృష్ణ 'అఖండ 2' సినిమా సెప్టెంబర్ నుంచి వాయిదా పడితే డిసెంబరు రిలీజ్ అవకాశముంది.