
Betting app: బెట్టింగ్ యాప్ ప్రచారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా సెలెబ్రిటీలతో ప్రారంభమైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇప్పటికే ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ పేర్లు ఉండగా, తాజాగా నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌ల పేర్లు కూడా బయటకొచ్చాయి.
బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే 'అన్‌స్టాపబుల్' షోలో 'ఫన్ 88 బెట్టింగ్ యాప్' ను ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ షోకు ప్రభాస్, గోపీచంద్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో ఫన్ 88 యాప్‌ను ప్రస్తావించగా, దాన్ని చూసిన ఓ వ్యక్తి యాప్ డౌన్‌లోడ్ చేసి బెట్టింగ్ ఆడి రూ.83 లక్షలు నష్టపోయాడు.
Details
ఆన్‌లైన్‌లో ఫిర్యాదు
రామారావు అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లు ఫన్ 88 యాప్ ప్రమోషన్ చేశారు. వారి ప్రచారాన్ని చూసి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొదట రూ. 3 లక్షల వరకు సంపాదించానని చెప్పాడు. అప్పులు తీర్చేంతవరకు గెలిచినా, మళ్లీ ఆడడం కొనసాగించగా చివరకు రూ. 83 లక్షలు నష్టపోయాడు.
అప్పుల బాధ భరించలేక ఊరు వదిలి పారిపోయి వచ్చానని బాధితుడు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై టాలీవుడ్ స్టార్స్‌పై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.