
Betting Apps : బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం.. ప్రముఖ నటీనటులపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్‌లను ప్రచారం చేసిన ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కలిపి మొత్తం 25 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఈ జాబితాలో ప్రముఖ సినీ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
వివరాలు
ప్రవీణ్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత వంటి వారు ఉన్నారు.
మియాపూర్‌కు చెందిన ప్రవీణ్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.