Nayanthara - Dhanush: 'బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదం.. నయనతారకు కోర్టు నోటీసులు
నటి నయనతార, నటుడు ధనుష్‌ల మధ్య 'బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ధనుష్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా 'నానుమ్ రౌడీ దాన్' చిత్రానికి చెందిన ఫుటేజ్‌ను ఉపయోగించినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ధనుష్ నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, నెట్‌ఫ్లిక్స్ బృందానికి లీగల్ నోటీసులు పంపించారు.
జనవరి 8లోపు వివరణ ఇవ్వాలి
హైకోర్టు ఈ కేసును విచారించి, నయనతార, విఘ్నేశ్ శివన్‌కు, అలాగే నెట్‌ఫ్లిక్స్‌కు జనవరి 8వ తేదీలోపు తమ ప్రతిస్పందనను ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదంలో ధనుష్ మూడు సెకన్ల క్లిప్ ఉపయోగంపై రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో నయనతార తనపై ధనుష్ ద్వేషం కనబరుస్తున్నారని ఆరోపించడంతో ఈ వివాదం ఎక్కువైంది.