
OTT Movie: ఓటీటీలో సందడి చేస్తున్న 'భైరవం'.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో కొత్త రికార్డ్!
ఈ వార్తాకథనం ఏంటి
వైవిధ్యమైన కంటెంట్‌తో నిరంతరం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న జీ5 ఓటిటి ప్లాట్‌ఫారమ్, మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలలో ఒకటిగా గుర్తింపు పొందిన జీ5.. ఇప్పుడు 'భైరవం' సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, జూలై 18 నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలోనే, ఓటీటీలోనూ 'భైరవం' విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధిస్తూ జీ5 ప్లాట్‌ఫారమ్‌పై రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
Details
జూలై 18 నుంచి స్ట్రీమింగ్
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్ర కథ గ్రామీణ నేపథ్యంలోని ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సంబంధాల చుట్టూ తిరుగుతుంది. ఆలయ భూములపై ఓ రాజకీయ నాయకుడు వేసిన కన్ను.. ఆ ముగ్గురు స్నేహితుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనేది కథ యొక్క ప్రధానాంశం. స్నేహం, ప్రేమ, భావోద్వేగాలు నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులకు విశేషంగా నచ్చింది. సినిమాటోగ్రఫీకి హరి కె. వేదాంతం పని చేయగా, సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల అందించారు. ఎడిటింగ్ బాధ్యతలు చోటా కె. ప్రసాద్ నిర్వహించారు. జూలై 18 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎమోషనల్ డ్రామాను మిస్ అవకండీ.