తదుపరి వార్తా కథనం
Bhairavam: పవర్‌ఫుల్ యాక్షన్‌తో 'భైరవం' టీజర్.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ డైలాగ్స్ సూపర్స్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 20, 2025
05:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
'భైరవం' ఒక యాక్షన్ మూవీ, ఇందులో బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు.
విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. టీజర్ ప్రారంభం 'రాత్రి నాకో కల వచ్చింది' అనే జయసుధ డైలాగ్‌తో ఆసక్తికరంగా ఉంటుంది.
అలాగే సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్‌గా 'ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ శ్రీనుగాడు ఉన్నాడు' అనే డైలాగ్‌తో కనిపించారు.
ముగ్గురు సోదరుల అనుబంధం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షంగా నిలవనుంది.
ఈ చిత్రంలో హీరోయిన్లుగా అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది నటిస్తున్నారు.