తదుపరి వార్తా కథనం

TFC : ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 28, 2024
01:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్నాళ్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగిన దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో భరత్ భూషణ్, ఠాగూర్ మధు పోటీదారులుగా నిలిచారు. ఈ ఛాంబర్ ఎన్నికల్లో భరత్ భూషణ్ గెలుపొందాడు.
దీంతో ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎంపికయ్యాడు.
భరత్ భూషణ్‌ను డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులు ఎంపిక చేశారు.
Details
ఉపాధ్యక్ష పదవి రేసులో అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరీ
ఇదిలా ఉండగా, ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరీ పోటీ పడ్డారు.
ప్రస్తుతం నిర్మాత నుంచి ఉపాధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. ఇక అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 సభ్యులు ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇందులో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు ఓట్లు వేస్తారు.